Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : *. శంకరపట్నం/కరీంనగర్/సెప్టెంబర్ 25(అక్షరం న్యూస్ ) శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల మహేందర్ ఆధ్వర్యంలో మండల స్థాయి నాయకులతో సలహాలు సూచనలు తీసుకున్నారు.వారం రోజుల్లో మండలంలో నూతన కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశం అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సభ్యత్వం పలువురు నాయకులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ఇన్చార్జ్ సంపత్,ప్రధాన కార్యదర్శి జలపతి,జిల్లా నాయకుడు గరిగే ప్రభాకర్,మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ దేవనూరి కిష్టయ్య,దేవునూరి మల్లేష్,బండారి తిరుపతి,బూర్ల వెంకటేష్,కత్తెరమళ్ళ కిరణ్, ఎలకపల్లి సుధీర్,దేవునూరి కుమారస్వామి,తాళ్ల అజయ్ లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily