Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్/గార్ల /సెప్టెంబర్ 25/అక్షరం న్యూస్... ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వర మెరుగైన వైద్య సేవలు అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మెడికల్ వార్డు, డయాలసిస్ సెంటర్, గైనిక్ వరల్డ్, క్యాన్సర్ బ్లాక్, డిఈఐసి, డిస్టిక్ ఎర్లీఇంటర్ వెన్షన్ సెంటర్, శిశు సంజీవని ప్రత్యేక నవజాతి, శిశు చికిత్స వార్డ్, ఐసీయూ లలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతూ అందుతున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి కి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వర మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతి వార్డులో మందులు, కావలసిన వైద్య పరికరాలు, అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.వర్షాకాలం సీజన్లో, సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నందున జిల్లా ఆసుపత్రికి ప్రజలు అధికంగా రావచ్చని, అందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు.వైద్య పరీక్షలు వెంటనే నిర్వహించి, మందుల పంపిణీ చేయాలని, ఆసుపత్రికి వచ్చే వారికి మర్యాదపూర్వకంగా వైద్య సేవలు అందించాలన్నారు.మెడికల్ ల్యాబ్, ఫార్మసీ, ఇన్, అవుట్, పేషెంట్ రిజిస్టర్ను తనిఖీ చేశారు.కలెక్టర్ వెంట డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీశ్వర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily