Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/లక్ష్మిదెవిపల్లి/సెప్టెంబర్ 24/అక్షరం న్యూస్ : లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా నిత్యం పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నేర విచారణలో జాప్యం జరగకుండా బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం సిబ్బంది సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily