Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : చొప్పదండి/ కరీంనగర్, సెప్టెంబర్ 21 (అక్షరం న్యూస్ ) గత మూడు రోజుల నుంచి చొప్పదండి మండలం లో జరుగతున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో శనివారం రోజున ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు ఈ యొక్క విమర్శల పూర్వా పరాల లోకి వెళితే గత పది రోజుల నుంచి తెలంగాణా లో కాంగ్రెస్ - బీర్ఎస్ పార్టీ ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చొప్పదండి మండలం కి కూడా పాకింది. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాందీ - హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య జరిగిన విమర్శలలో పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ని, కాంగ్రెస్ పార్టీ ని విమర్శించాడన్న కారణం తో సీఎం రేవంత్ రెడ్డి కి, కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాడి కౌశిక్ రెడ్డి పై, బీఆర్. ఎస్ పార్టీ పై పలు విమర్శలు చేశాడు. చొప్పదండి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పై, పాడి కౌశిక్ రెడ్డి పై చేసిన విమర్శల కు కౌంటర్ గా బీఆర్.ఎస్ పార్టీ కి మద్దతుగా కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, చొప్పదండి మండలము కి చెందిన బీఆర్.ఎస్ పార్టీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే పై పలు విమర్శలు చేశాడు. అయితే రవీందర్ రెడ్డి చేసిన విమర్శ కు చొప్పదండి ఎమ్మెల్యే కి, కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చొప్పదండి పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి రవీందర్ రెడ్డి పై విమర్శలు చేసి, తమ ఎమ్మెల్యే ని ఏమైనా విమర్శిస్తే ఊరుకునేది లేదని రవీందర్ రెడ్డి పై విమర్శలు చేసాడు. ఇదే విషయం శనివారం రోజున పలు పత్రికల్లో వచ్చింది. అలాగే శనివారం రోజున కొన్ని పత్రికల్లో బ్రేకింగ్ న్యూస్ గా కూడా వచ్చింది. అయితే బీఆర్.ఎస్ నాయకుడు రవీందర్ రెడ్డి పై చొప్పదండి పట్టణ అధ్యక్షులు ముద్దం తిరుపతి చేసిన విమర్శలకు కౌంటర్ గా, తమ నాయకుడు రవీందర్ రెడ్డి కి మద్దతుగా బీఆర్.ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం యువజన విభాగం ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్ చొప్పదండి మండల కేంద్రం లో మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీ గా ఓడిపోయి,మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా కూడా ఓడిపోయిన ముద్దం తిరుపతి, నువ్వు మా ఏనుగు రవీందర్ రెడ్డి ని విమర్శిస్తున్నావ అని భక్తు విజయ్ విమర్శించారు. తెలంగాణా ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తి, జైల్ కి వెళ్ళిన వ్యక్తి,పోలీస్ ల లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి మా రవీందర్ రెడ్డి అని విజయ్ అన్నారు. మా బీఆర్. ఎస్ పార్టీ యువ నాయకుడు, ఏ ఆపద వున్నా కార్యకర్తలను ఆదుకునే మా రవీందర్ రెడ్డి ని మళ్ళీ విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోము, మీ కాంగ్రెస్ పార్టీ లోనే చొప్పదండి మండలం లో పార్లమెంట్ ఎన్నికల ముందు అంతర్గత కలహాలు జరిగాయి, అటువంటిది నువ్వు మా నాయకులను, మా పార్టీ ని విమర్శిస్తున్నావా అని భక్తు విజయ్ కుమార్ విమర్శించారు.
.
Aksharam Telugu Daily