Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా/ సత్తుపల్లి /21 సెప్టెంబర్/ అక్షరం న్యూస్: సింగరేణి కొత్తగూడెం ఏరియా జె.వి.ఆర్ ఓసి గనిపై ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ అధ్యక్షతన జే.వి.ఆర్ ఓసి ఫిట్ సెక్రటరీ రామారావు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ తాగరజన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా త్యాగరాజన్ , రజాక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సహాయ సహకారంతో ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం 2023 - 24 రూ.2,412 కోట్ల లాభం. ఉద్యోగులకు లాభాల వాటా 33 శాతం 796 కోట్ల రూపాయలు పంపిణీ చేయుటకు మరియు గతంలో ఎన్నడూ లేని విధంగా సంస్థలో పనిచేసే ఒప్పంద కార్మికులకు 5 వేలు రూపాయలు బోనస్ ఇచ్చుటకు అంగీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డికి , రాష్ట్ర మంత్రివర్యులకు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులకు , సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు కొత్తగూడెం ఏరియా ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా లాభాల వాటా ఇప్పించుటకు ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ కృషి చేసింది అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి సత్తుపల్లి జే.వి.యర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నూతన డంపర్లు , షవల్స్ , మోటార్ గ్రేడర్లు , డోజర్లు ఇతర హెచ్.ఇ.ఎం.ఎం మిషనరీ కొనుగోలు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ పని చేస్తుందని తెలియజేశారు. సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో త్వరలో యాజమాన్యంతో మాట్లాడి ఉద్యోగుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని , నూతన బొగ్గు గనుల ఏర్పాటు , కార్మికునికి సంబంధించిన పెరిక్స్ పై విధించే ఇన్కమ్ టాక్స్ రద్దు చేయిస్తామని , ఎన్ -1 రద్దు చేపిస్తామని తెలియజేశారు.ఉద్యోగుల సంక్షేమం మరియు ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఎల్లప్పుడూ ఐ.ఎన్.టి.యు.సీ యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి కేంద్ర కమిటీ నాయకులు ఆల్బర్ట్ , సత్తుపల్లి ఐ.ఎన్.టి.యు.సి నాయకులు బట్టి విక్రమార్క తీగల క్రాంతికుమార్ , చెన్నకేశవరావు , నాగ ప్రకాష్ , బాలాజీ ఫిట్ సెక్రటరీ , కిష్టారం ఓసి , నాగేశ్వరరావు ఫిట్ సెక్రటరీ , జె. వి.ఆర్ - సి.హెచ.పి , సీతారామరాజు , మురళి , రత్నాకర్ , వెంకట్ రెడ్డి, కోటి , ఐవి రెడ్డి , సురేష్ , బాలకృష్ణ , రామచందర్ , ప్రసన్న , లింగమూర్తి , దావూద్ , పొట్టి కిరణ్ , రఘువీర్ , రాము , రఫీ , శ్రీనివాసరావు , చాంద్ , రవి బాబు , మున్వర్ ఖాన్ , బాలకృష్ణ , నాగేశ్వరరావు , తిరుమల రావు , శ్రీధర్ , సుదర్శన్ , రషీద్ , నరసింహులు , సతీష్ , సూర్యనారాయణ , రవికుమార్ , శంకర్ , అంబ్రోస్ , సత్యనారాయణ , చంద్రశేఖర్, రామచందర్,హరి కుమార్ , హైదర్ అలీ , రమేష్ , పాషా ఇతర ముఖ్య నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily