Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 19 అక్షరం న్యూస్ పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కలవేన సాయి కృష్ణ తండ్రి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ప్రతిరోజు తన పొలానికి నీళ్లు పెట్టడం కోసం వెళుతుండేవాడని అదే తరుణంలో కొత్తపల్లి నుండి, కొలనూరు గ్రామాల మధ్య గల రహదారిపై గురువారం రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవీన రాజేశం ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తెలిపారు స్థానికుల సమాచారం మేరకు పెద్దపల్లి ఏసీపి గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు లు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కుమారుడు సాయి కృష్ణ కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ. రెండు గ్రామాల మధ్య గల రహదారిపై హత్య జరగడం సంచలనంగా మారింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
.
Aksharam Telugu Daily