Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ సెప్టెంబర్ 19(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లో ఆదివాసీ మహిళా మెస్రం నీలా బాయి పైన ముగ్దమ్ అనే ముస్లిం కులానికి చెందిన ఆటో డ్రైవర్ నీలా బాయి పై చేసిన లైంగిక అఘాయిత్యాన్ని ఖండిస్తూ భాధితురాలి కీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘటనకు వ్యతి రేఖంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి,తుడుందెబ్బ,అనుబంధ సంఘాలైన ఆదివాసీ మహిళా సంఘం,ఆదివాసీ రైతు సంఘం,ఆదివాసీ విద్యార్థి సంఘం,ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆదివాసీ యూవసేన ల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 న తుడుందెబ్బ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని షెడ్యూల్ ఏరియా హక్కులను ఉల్లoఘించి అక్రమంగా వలస వచ్చిన గిర్జనేతరులు ఆదివాసీల పైన ఇష్టా రాజ్యాంగ తమ ఆకృత్యాలను కొనసాగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండటం దారుణమని ఏజెన్సీ చట్టాలు,హక్కులను అక్రమ చొర బాటు దారులు ఉల్లంగిస్తున్నా ఏజెన్సీ ప్రాంతం లో పని చేస్తున్న అన్ని శాఖల అధికార యంత్రాంగంగిర్జనేతర వలస వాదులకు కొమ్ము కాస్తున్నాయని అధికార యంత్రాంగం ఆదివాసుల చట్టాలను అమలు చేసి ఉంటే ఆదివాసేతర దోపిడీ అక్రమ చొరబాటు దారుల ఆకృత్యాల నుంచి ఆదివాసులు రక్షించ బడుతారని తక్షణమే ఏజెన్సీ లో 1/70,పేసా,లాంటి చట్టాల అమలుకు తుడుందెబ్బ పోరాడుతుందని ఈ బంద్ వియవంతం కోసం వ్యాపార వాణిజ్య,విద్యా సంస్థలు పాఠశాల లు,కళాశాలలు, పెట్రోల్ పంపులు అన్నీ రకాల వ్యాపార సముదాయాలు,ప్రజలు, ప్రజాస్వామిక వాదులు,పౌరులు ఈ బంద్ కు సంహరించాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి పిలుపునిచ్చారు కార్యక్రమం లో ఈక విజయకుమార్,అలెం జంపయ్య, వజ్జ జేయందర్,శిడం రమేష్ పుల్సాం మునేష్,ఇరుప పవన్ బూరక పవన్,వాసం రవి,లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily