Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ సెప్టెంబర్ 19(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు ఈ మేరకు బుధవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో ఎంపీ కోరిక బలరాం నాయక్ తో కలిసి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను దాదాపుగా మండలంలో 40 కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుందని గంగారం మండల కేంద్రం నుంచి కామారం వరకు 20 కోట్లతో డబల్ రోడ్డు కోమట్లగూడెం పెద్ద రోడ్డంపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి 3.5 కోట్లు, మర్రిగూడెం పెద్దవారుపై బ్రిడ్జి నిర్మాణానికి 3.60 కోట్లు, దొరవారి వేంపల్లి తార్ రోడ్డు రెన్యువల్ కు 1 కోటి 50 లక్షలు, వెంకమ్మ గుంపు తారు రోడ్డు రెన్యువల్ కు 80 లక్షలు, బర్ల గుంపు తారు రోడ్ రెన్యువల్ 80 లక్షలు,కొడిషలమిట్ట గ్రామం నుండి పంది పంపుల గ్రామం వరకు తారు రోడ్ నిర్మాణానికి 5 కోట్ల 20 లక్షలు, మామిడిగూడెం నుండి మిర్యాలపెంట గ్రామానికి 1 కోటి 50 లక్షలు తారు రోడ్డు రెన్యువల్ కు నిధులు కేటాయించామని త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు పూర్తిగా గంగారం మండలం ఏజెన్సీ కావడంతో ఫారెస్ట్ ఇబ్బందులు ఉండడం రోడ్లకు అడ్డంకిగా మారిందని అయినా ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తానని గంగారం మండలం నా రాజకీయ జీవితానికి పునాదులు వేసింది ఈ మండల మేనని అట్లాంటిది ఈ మండల అభివృద్ధి చేస్తానని ఇక్కడి భూములకు రెండు పంటలకు నీళ్లు అందించేందుకు పాకాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇస్తానని అదే విధంగా కరెంటు సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ బలరాం నాయక్, సంబంధిత శాఖ అధికారులు, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మండల నాయకులు,అనుబందసంఘాల అధ్యక్షులు,యూత్ నాయకులు,సీనియర్ నాయకులు,మహిళా నాయకురాళ్లు,గ్రామకమిటీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు, సీతక్క అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు గంగారం మండలంలోని పెద్ద ఎల్లా పురం గ్రామానికి చెందిన బొల్లబోయిన సారయ్యను, మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన శ్రీను డాక్టర్, అదే గ్రామానికి చెందిన తూర్సం పద్మ, దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన ఇక చంద్రయ్య గారు ఇటీ మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సాంగ్ కొత్తగూడ గంగారం మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సీతక్క అభిమానులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily