అక్షరం తెలుగు డైలీ - టెక్నాలజి / : గత ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో, రిలయన్స్ భారతదేశంలో జియో ఫోన్ 5G ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఏడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఈ ఫోన్‌ను విడుదల చేయాలని భావించారు. కానీ అనుకున్న ప్రకారం అది జరగలేదు. కాగా , ఇప్పుడు Jio అక్టోబర్‌లో 5G సేవను ప్రారంభించాలని భావిస్తున్నందున, రాబోయే కొన్ని వారాల్లో Jio ఫోన్ 5Gని ఆవిష్కరించవచ్చు అని అంచనాలున్నాయి.అవును, రిలయన్స్ Jio ఫోన్ 5Gని పరిచయం చేయబోతోంది, అయితే దీని లాంచ్ టైమ్‌లైన్ ఇంకా అధికారికంగా విడుదల కాలేదు.
Aksharam Telugu Daily