అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : అక్షర న్యూస్ డైలీ న్యూఢిల్లీ: హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి. దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీనిప్రభావంతో ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లో 4.3 తీవ్రత ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో మరోసారి భూమి కంపించింది. బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. కాగా, గత పదేండ్లలో ఉత్తరాఖండ్‌లో 7 వందల సార్లు భూకంపాలు సంభవించాయని నిపుణులు తెలిపారు.
.
Aksharam Telugu Daily