అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : అక్షరం న్యూస్ డైలీ పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. దాదాపు 350 కోట్ల వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. దీంతో ‘పుష్ప-2’ (ది రూల్) గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 13 నుంచి బ్యాంకాక్‌లో యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది అక్కడి అడవుల్లో భారీ పోరాట ఘట్టాలకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం వచ్చే నెలలో ఫస్ట్ టీజర్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారని తెలిసింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, అనసూయ భరద్వాజ్ ముఖ్యపాత్రల్ని పోషి స్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రో జెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహి త్యం: చంద్రబోస్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.
.
Aksharam Telugu Daily