Sunday, 14 July 2024 09:52:54 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :

-ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ వీడియోకాల్, స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరు...వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి... -సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయెల్...


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 May 2024 08:10 PM Views : 255

అక్షరం తెలుగు డైలీ - తెలంగాణ స్టేట్ బ్యూరో / హైదరాబాద్ : గతకొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.   ఉన్నత చదువుకున్నవారు కూడా సులభంగా వారి బారిన పడి మోసపోతున్నారు. వారి మాటల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరి కొంతమందైతే సైబర్ కేటుగాళ్ల టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి కేటుగాళ్ల ముఠా హైదరాబాద్‌కి చెందిన మహిళను టార్గెట్ చేసి బెదిరించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి ఓ వ్యక్తి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్కిటెక్ట్ అయిన ఓ మహిళలకు ఫోన్ చేశాడు. తనని తాను మహారాష్ట్రకు చెందిన పోలీసుగా ఆమెకు పరిచయం చేసుకున్నాడు. మీరు మనీలాండర్ కేసులో చిక్కుకున్నారని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని ఆమెకు చెప్పాడు. ఆ కేసులో భాగంగా తనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని అందుకే ఫోన్ చేసినట్లు బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి చెప్పిన మాటలకు భయాందోళనకు గురైన ఆమె.. తనని ఆ కేసు నుంచి ఎలా అయినా బయటకు వచ్చేలా చూడాలంటూ కోరింది. ఇదే అదునుగా భావించన ఆ కేటుగాడు.. స్కైప్ ద్వారా వీడియోకాల్ చేయాలని కోరాడు. వాడు చెప్పిన విధంగానే ఆమె వీడియో కాల్ చేసింది. ఆ తర్వాత ఆ సైబర్ నేరగాడు ఆమెను పలు విధాలుగా బెదిరింపులకు గురిచేశాడు. ఆమెను  రాత్రంతా వీడియో కాల్ ఆన్‌ చేసి ఉండాలని కోరాడు. దానికి ఆమె ఒప్పుకోగా.. తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన ఆర్కిటెక్ట్.. అతడు చెప్పిన పలు ఖాతాలకు రూ.60 లక్షలు వరకూ ట్రాన్స్‌పర్ చేసింది. అయితే ఈ తతంగం అంతా వీడియో కాల్ కొనసాగుతుండగానే జరిగింది. వాడు పోలీస్ కాదు.. ఓ కేటుగాడు అని గుర్తించిన ఆమె వెంటనే తేరుకుంది. వెంటనే ఆమె 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమతమైన  సీఎస్‌బీ బృందం ఆమె చేసిన ఆన్‌లైన్ లావాదేవీలను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో నమోదు చేయించారు. ఆమె పంపిన బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకున్న అధికారులు వెంటనే.. సదురు బ్యాంకుతో మాట్లాడి ఆమె పంపిన డబ్బును తీయడానికి వీలు లేకుండా చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా కేవలం ఓ గంటలోనే వారు ముగించారు. దీంతో బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయెల్.. పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ వీడియోకాల్, స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరని.. అలా చేస్తే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :