Sunday, 14 July 2024 09:53:54 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం :

నా భూమిని కబ్జా చేస్తున్నారు - మల్లారెడ్డి


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 May 2024 07:41 PM Views : 259

అక్షరం తెలుగు డైలీ - తెలంగాణ స్టేట్ బ్యూరో / హైదరాబాద్ : సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన అనుచరులతో పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చి వేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదేనంటూ 15 మంది ఘటనా స్థలికి వచ్చారు.  400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం తమ భూమిపై కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :