Sunday, 14 July 2024 09:54:25 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా...

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 May 2024 07:20 PM Views : 271

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పి ఎస్ యు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లులో టిఎస్  బదులుగా టిజి గా మార్చాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్  సూచించే 'టీఎస్' స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు. మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుమతులు రాగా,  తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్ కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పీఎస్ యులు, ఏజెన్సీల పేర్ల ముందు టిఎస్ కు బదులు టిజి గా మార్చాలని ఆదేశించారు. ఉదాహరణకు  టీఎస్ఎన్పిడిసిఎల్ పేరును ఇక నుండి టిజిఎన్పిడిసిఎల్ గాను, టీఎస్ఆర్టీసీ పేరును టిజిఆర్టీసీగా మార్చాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం  సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టిజితో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని ఆమె సూచించారు. లెటర్  హెడ్లు, రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్, పాలసీ పేపర్లు, జీవోలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని ఆమె  పేర్కొన్నారు. శాఖలు ద్వారా  భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర,  ప్రత్యుత్తరాలలో  టీఎస్ కు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు. ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఈ నెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని, అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :