Sunday, 14 July 2024 09:20:20 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం...

-హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, -గెలిపిస్తే పేద ప్రజల రుణం తీర్చుకుంటాను...అభ్యర్థి పూజరి సత్యనారాయణ


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 May 2024 07:04 PM Views : 492

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణ ని విద్యావంతులు, మేధావులు 38వ సీరియల్ నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పట్టభద్రులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం  కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మారెల్లివిజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో  ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం శాసనాల ప్రతిపాదనల కోసం చర్చలు చేయాల్సిన పెద్దల సభకు శాసనమండలికి విద్యావంతులైన మేధావులను పంపాలని ఈ సందర్భంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పట్టు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో నిష్కల్మషంగా, నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఎంఈఓ, సామాజిక ఉద్యమకారులు పూజరి సత్యనారాయణ ని ఓటు అనే ఆయుధం ద్వారా విద్యావంతులు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పూజరి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినట్లయితే పేద ప్రజల రుణం తీర్చుకుంటానని, విద్యా ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది చట్టసభల ద్వారా పేద ప్రజలగొంతునై వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర సలహాదారులు కృష్ణమోహన్, రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ అధ్యక్షురాలు లక్ష్మి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, మహబూబాబాద్ జిల్లా మాలోతి వెంకటేష్, ఉపాధ్యక్షులు మారెల్లి విజయకుమార్,జిల్లా కమిటీ సభ్యులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సామాజిక ఉద్యమకారులు, ఆర్టిఐ కార్యకర్తలు, పలు సామాజిక కుల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ గెలుపు కోసం పని చేస్తామని సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :