అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : అక్షరం డైలీ: కోవిడ్-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 937 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,61,516కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,515 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,16,492 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,509కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.73 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
.
Aksharam Telugu Daily