అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : అక్షరం డైలీ : ఊర్వశివో రాక్షసివో’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు యువహీరో అల్లు శిరీష్. సినిమాలో తాను పోషించిన మధ్యతరగతి యువకుడు శ్రీకుమార్ పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిందని చెప్పారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ముద్దు దృశ్యాల్ని ఈస్థటిక్ సెన్స్‌తో తెరకెక్కించాం. ఎక్కడా హద్దులు దాటలేదు కాబట్టి లిప్‌లాక్ సీన్స్ ఆమోదయోగ్యంగా ఉన్నాయంటున్నారు. ఈ సినిమాలో ప్రేమ, సహజీవనం, పెళ్లి అంశాల్ని చర్చించాం. వ్యక్తిగతంగా వివాహ వ్యవస్థపై నాకు బలమైన విశ్వాసం ఉంది. లవ్, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కు అంతిమ గమ్యం పెళ్లి మాత్రమే అని నమ్ముతాను. సహజీవనం అనంతరం పెళ్లాడితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఇక నా పెళ్లి విషయానికొస్తే..హిట్ సినిమా మాదిరిగా అనుకుంటే అది సాధ్యం కాదు (నవ్వుతూ). దానికి అన్ని పరిస్థితులు, గ్రహాలు అనుకూలించాలి. ఇంట్లో పెళ్లి విషయంలో ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదు. ఆ నిర్ణయాన్ని నాకే ఒదిలేశారు. ఇక నా రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటో తెలియదు. ఒకవేళ ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నా చెప్పలేం కదా (నవ్వుతూ). నా తదుపరి సినిమా ఇంకా ఖరారు కాలేదు. రెండు కథల్ని సిద్ధం చేసి పెట్టుకున్నా’ అన్నారు.
.
Aksharam Telugu Daily