అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ/ నవంబర్.04/ అక్షరం న్యూస్; ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. నవంబర్.04 న సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున కేక్ ను కోసి, అభిమానుల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి మాతాశిశు కేంద్రంలోని గర్భిణీ లకు రగ్గులు మరియు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడాతూ మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కుమార్ తో కలిసి అహర్నిశలు శ్రమించిన అశ్రిఫ్ కు అభినందించారు. అశ్రిఫ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ,సృష్టికర్త దీవెనలు ఎల్లపుడు ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సద్దాం , షారుక్ , ఆఫ్రోజ్, సిటీ పాన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహోసిన్, గౌస్ ,ముదస్సిర్ ,జావేద్, సాయి , సాయి హర్ష ,అభిమానులు తదితరులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
Aksharam Telugu Daily