అక్షరం తెలుగు డైలీ - క్రీడలు / : అక్షర న్యూస్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో ఈ వరల్డ్‌కప్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈనేపథ్యంలో శుక్రవారం జరిగే అత్యంత కీలక పోరులో అఫ్ఘానిస్థాన్‌ను ఢీకొననుంది. అఫ్ఘానిస్థాన్‌పై భారీ తేడాతో విజయం సాధించి రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకొంటేనే కంగారూల సెమీస్ ఆశలు నిలుస్తాయి. అఫ్ఘాన్‌తో పోరు నేడు-మ.1.30 నుంచి అడిలైడ్ : డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త ప్రదర్శనతో ఈ వరల్డ్‌కప్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈనేపథ్యంలో శుక్రవారం జరిగే అత్యంత కీలక పోరులో అఫ్ఘానిస్థాన్‌ను ఢీకొననుంది. అఫ్ఘానిస్థాన్‌పై భారీ తేడాతో విజయం సాధించి రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకొంటేనే కంగారూల సెమీస్ ఆశలు నిలుస్తాయి. అలాగే శనివారం జరిగే ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్ ఫలితం అంతిమంగా ఆసీస్ బెర్త్‌ను ఖరారు చేయనుంది. ఆసీస్, ఇంగ్లండ్ చెరో ఐదేసి పాయింట్లతో ఉన్నా..ఫించ్ సేన నెట్ రన్‌రేట్ మైన్‌సలో ఉండడం ప్రతికూలంగా మారింది. నాకౌట్ రేస్‌నుంచి ఇప్పటికే నిష్క్రమించిన అఫ్ఘానిస్థాన్ ఆఖరి మ్యాచ్‌లో కసిదీరా ఆడి ఆస్ట్రేలియాను కంగుతినిపిస్తుందేమో చూడాలి. ఇక టోర్నీలో ఇప్పటివరకు ఆసీస్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈ కీలక మ్యాచ్‌లో రెండు విభాగాలు అద్భుత ప్రదర్శన చేయక తప్పదు. కాగా..టీ20లలో ఆసీస్-అఫ్ఘాన్ తొలిసారి తలపడుతుండడం గమనార్హం.
.
Aksharam Telugu Daily