అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : న్యూఢిల్లీ అక్షరం న్యూస్ : పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో జరుగుతున్న పంట వ్యర్ధాల కాల్చివేతపై నిందారోపణలు వద్దు అని కేజ్రీవాల్ తెలిపారు. వాయు కాలుష్యం అనేది నార్త్ ఇండియా సమస్య అని, వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని కేజ్రీ అన్నారు. ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు అన్నారు. ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి మేమే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా పంట వ్యర్ధాల కాల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని, వచ్చే ఏడాదికి ఇలాంటి కాలుష్యం లేకుండా చూస్తామని కేజ్రీ అన్నారు. తమ ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే వచ్చిందని, ఈ సమస్యను ఎదుర్కోవడంలో మాఫియాలు అడ్డువస్తున్నాయని, కానీ వచ్చే ఏడాదిలోగా దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. 40 లక్షల ఎక్టార్లలో వరి పంట పండిస్తున్నారని, వచ్చే ఏడాది లోగా ఆ భూముల్లో పంట మార్పిడికి ప్రయత్నాలు చేస్తామని పంజాబ్ సీఎం మాన్ తెలిపారు. ఢిల్లీ తరహాలోనే హర్యానా, యూపీలోని అనేక నగరాల్లో వాయు నాణ్యత క్షీణించినట్లు ఇద్దరు సీఎంలు వెల్లడించారు. పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నానరు. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి ఢిల్లీలో ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల్ని ఆశ్రయించేందుకు ఎంఎస్పీల గురించి హామీ ఇస్తున్నట్లు సీఎంలు తెలిపారు.
.
Aksharam Telugu Daily