అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : ఎమ్మెల్సీ తాత మధు వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం బహిష్కరణ భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం / నవంబర్ 20 /అక్షరం న్యూస్ : భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ తాతా మధు అహంకార పూరిత పోకడలకు నిరసనగా భద్రాచలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు ఒక తాటిపైకి వచ్చి తాతా మధుకి వ్యతిరేకంగా నిరసనగలం విప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుండి భద్రాచలం మీడియాపై తాతా మధు వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ నేటి నుండి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బహిష్కరిస్తున్నట్టు జర్నలిస్టుల జేఏసీ నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం విలేకరుల పట్ల తాత మధు అనేక సందర్భాలలో చునకన చేసి అవహేళనగా మాట్లాడడమే కాక కేటీఆర్ పర్యటన సైతం ఖమ్మం నుండి పాత్రికేయులను పిలిచి రాస మర్యాదలు చేసి భద్రాచలం విలేకరులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అహంకార వైఖరితో వ్యవహరించడంతో భద్రాచలం పట్టణంలోని విలేకరులందరూ తాతా మధు పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉన్న ప్రెస్ క్లబ్బులందరూ ఒకటై జేఏసీకి ఏర్పడి నేటి నుండి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బహిష్కరించడమే కాక ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న గ్రూపుల నుండి కూడా పాత్రికేయులు బయటికి వచ్చేయాలని తీర్మానం చేశారు. ఇప్పటికే అన్ని రంగాలలో ఎన్నికల ప్రచారంలో వెనుక పడుతున్న తెల్ల వెంకటరావుకి విలేకరులు తీసుకున్న నిర్ణయంతో మరింత నష్టం కలిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పార్టీలో అంతర్గత గ్రూపుల గొడవలకు తోడు ఇన్చార్జి తాత మధు వ్యవహారాశైలి తో నేడు పాత్రికేయులు కూడా తెల్లం వెంకట్రావు పై తిరుగుబాటు బహుట వ్యతిరేకంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెల్లం వెంకటరావుకి గోర పరాభవం తప్పదని తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ పాత్రికేయులు తమ వ్యక్తిగత ఎజెండాలను పక్కనపెట్టి ఆత్మగౌరవం కోసం ఒక తాటిపైకి వచ్చి అధికార బిఆర్ఎస్ పార్టీ అహంకారానికి వ్యతిరేకంగా గళం విప్పటం ఒక నూతన పరిణామంగా కనిపిస్తుంది
.
Aksharam Telugu Daily