అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / ఖమ్మం : మూడవసారి బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం .. ఆరు గ్యారంటీలు చెప్పె వారికే వారెంటీ లేదు.. విలేకరుల సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు ఖమ్మం/ వైరా నవంబర్ 20 (అక్షరంన్యూస్) వైరా లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎంపీ నామ నాగేశ్వరరావు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, వైరా నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ మాజీ ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి పరిశీలించారు .ఈ సందర్భంగా ఎంపీ నామానాగేశ్వరరావు మాట్లాడుతూ నవంబర్ 21న వైరా లో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రజా అశీర్వద సభను విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం ధ్యేయంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని అన్నారు .రాబోయే ఎన్నికల సందర్భంగా బీఆర్ యస్ మేనిఫెస్టో పథకాలు పేదలకు మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. రైతుబంధు పథకం 16,000 మహిళలకు సంక్షేమం కోసం 400 రూపాయలు కె గ్యాస్ పథకం .ప్రతి నెలా సౌభాగ్య లక్ష్మి పధకం ద్వారా 3000, మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కేంద్రంలో పరిపాలించేది బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు వారు పరిపాలించే రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు పేదలకు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వటం లేదు మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.అరు గ్యారంటిలు చెప్పె వారికే వారెంటీ లేదు అని అన్నారు,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదించి పంపిన వైరా నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ ను బారి మెజారిటీ తో గెలిపించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ,వైరా నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily