అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / ఖమ్మం : ఖమ్మం/తల్లాడ నవంబర్ 20 (అక్షరంన్యూస్) కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు, లంబాడ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాధావత్ సైదులు నాయక్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏన్కూరు మండలంలోని జన్నారం గ్రామంలో ఆయన రాందాస్ తో కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. స్థానికుడు, సౌమ్యుడు అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితులు రాందాస్ నాయక్ కు చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు బాబురావు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily