Friday, 01 December 2023 06:57:19 PM
 Breaking
     -> ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఎలియాస్ శిరీష..      -> ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది..      -> ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలన..      -> బిఆర్ఎస్కు భారీ షాక్ కాంగ్రెసులో చేరిన కీలక నేతలు..      -> పాల్వంచ నవ లిమిటెడ్ వారి మహిళా సాధికార కేంద్రంలో ఘనంగా 70వ అఖిల భారత సహకార వారోత్సవాలు :..      -> ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - బిగుల్ల దుర్గా సుదర్శన్ ..      -> ఆత్మకూరులో బిజేపికి షాక్.....      -> మేం రామ భక్తులం నా పేరే తారక రాముడు...భద్రాద్రి రామాలయాన్ని మరో యాదాద్రి చేసి చూపిస్తా...భద్రాచలం రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్....      -> తండ్రి గెలుపు కోసం కూతురు కోరుకంటి ఉజ్వల గడపగడపకు ప్రచారం...      -> సీఎం కేసీఆర్‌ సభను విజయవంతం చేయాలి..      -> కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ పార్టీకి భారీ షాక్..      -> కాంగ్రెస్ఆరుగ్యారంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరిక ..      -> భద్రాచలంలో రేపు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..      -> కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి : -పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే....      -> మణుగూరు లో జన జాతర ..

గులాబీలా జెండలే రామక్కా.పాటకు చిందులు వేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .

.

Date : 20 November 2023 07:11 PM Views : 29

అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రికొత్తగూడెం/పినపాక : భద్రాద్రికొత్తగూడెం , పినపాక, నవంబర్ 20(అక్షరం న్యూస్ ): బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పినపాక అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రచారం లో భాగంగా పినపాక మండలం తోగ్గూడెం పంచాయితీ లో సోమవారం ప్రచారం ప్రారంభించారు. గ్రామంలో లోకి తన ప్రచార రథం రాగానే గోపాలరావు పేట గ్రామ ఆడపడుచులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కాంతారావు పాలనలో గ్రామంలో రహదారులు స్వచ్ఛ శ్యామలంగా మారాయి అని గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తెచ్చి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దలని గ్రామ దేవతలకు పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు.ప్రచారంలో రేగా ఆడపడుచులతో స్టెప్పులు వేశారు. రేగా మాట్లాడుతూ గోపాలరావుపేట గ్రామంలో అంతర్గత రహదారులకు పెద్దపీట వేశామన్నారు. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తా ఈ సారి ఆశీర్వదించండి 50 లక్షలు నేనే సంతకం పెట్టి ఇస్తా.బీసీ గురుకుల కళాశాలకు సర్వే కూడా పూర్తయింది. మీ గ్రామానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు.మాయదారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు అని కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.అధికారంలోకి రాగానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల మహిళ బృతి అందజేస్తామన్నారు.రైతులకు రైతు బందు15000తో పాటు రైతు కూలీలకు ఐదు లక్షల బీమా మన ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు. ఈ ప్రాంతంలో రెండు పంటలు పండించాలంటే కారు గుర్తు కు ఓటు వేయాలన్నారు.ఎలక్షన్ ముగిశాఖ లోటరీ గండి సర్వే పూర్తి అవుతుందని,లోటరి గండి ప్రాజెక్టు వల్ల రెండు మండలాల్లో రెండు పంటలు పండుతాయని అన్నారు.ఇవన్నీ జరగాలంటే ఒక్క రేగా వల్లనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ వోడి మాటలు నమ్మి మోసపోతే మనల్ని ముంచేస్తారన్నారు.ప్రజలు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు ను కారు గుర్తు పై వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.మంత్రిగా మళ్ళీ మీ గ్రామానికి వొచ్చి బీసీ గురుకులాన్ని ప్రారంభిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :