అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/ ఆత్మకూరు : హనుమకొండ/అత్మకూర్/నవంబర్ 19,అక్షరం న్యూస్. . ఆత్మకూరు మండలంలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని పెంచికలపెట సొసైటీ డైరెక్టర్ కోడూరి రమేష్,ఆత్మకూరు వార్డు మెంబర్ రేవూరి శ్యాంసుందర్ రెడ్డి బిజెపి కి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్ ఎస్ నాయకులు ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు కంది శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ అంకుష్, గూడెప్పాడ్ ఎంపిటిసి బీరం రజినికర్ రెడ్డి ఆధ్యర్యంలో పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. పరకాలలో బిజెపి ఖాళీ అవుతుందని,కాంగ్రెస్ పని కతం అవ్వడం ఖాయం గులాబీ జెండా ఎగురవేయడం తధ్యం అని ఎమ్మెల్యే చల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,బిఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily