అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని జిల్లా/ పెద్దపల్లి : గోదావరిఖని ప్రతినిధి/పెద్దపల్లి/నవంబర్ 19/అక్షరం న్యూస్: తన తండ్రి రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరు కంటి చందర్ ను గెలిపించాలని ఆయన కూతురు కోరుకంటి ఉజ్వల ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్ గాంధీనగర్ లో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి తన తండ్రి కోరుకంటి చందర్ ను గెలిపించాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ సభ్యురాలు తస్లీమా భాను, కార్పొరేటర్ గాదం విజయ నందు ఆధ్వర్యంలో కోరు కంటి ఉజ్వల,పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ కూతురు కోరికంటి ఉజ్వల గడపగడపకు తిరుగుతూ కెసిఆర్ మేనిఫెస్టో ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈనెల 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి కోరుకంటి చందర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నైమా,బిల్కీస్,ఫర్జానా,సాజిదా,షబానా, రిజ్వానా,సానియా,హీన,నేహా,అజ్మత్,తాజ్ రిజ్వానా, హబీబా,నస్రిన్,ముంతాజ్,మేరాజ్,షాహిన్,లాస్య, ఫరీదా,మెహబి,ముంతాజ్,సోనీ,ఆశ తదితరులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily