అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/జఫర్గడ్ : జఫర్ గడ్, నవంబర్19, అక్షరంన్యూస్ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ చాగల్లులో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, క్లస్టర్ ఇంచార్జి అన్నం బ్రహ్మ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మండల పార్టీ ముఖ్య నాయకులకు ప్రజా ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు యువజన నాయకులకు మహిళలకు అభిమానులకు వివిధ గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.సీఎం కేసీఆర్ ను మూడో సారి ముఖ్య మంత్రిగా గెలిపించటానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారన్నారు.తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారని పేర్కొన్నారు.మండలం నుండి భారీ సంఖ్యలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily