అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల/తంగళ్ళపల్లి/నవంబర్ 20 (అక్షరం న్యూస్): తంగళ్ళపల్లి మండల కేంద్రములో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల కార్యాలయాన్ని ఆదివారము ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత పది సంవత్సరాలలో తంగళ్ళపల్లి మండలంలో ప్రయాణికులకు కావలసినటువంటి బస్టాండ్ ను, కూరగాయలు అమ్ముకోవడానికి మార్కెట్ను ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. నన్ను గెలిపిస్తే తంగళ్ళపల్లి మండలాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూతనంగా పెళ్లి చేసుకునే వధువులకు పుస్తె మట్టేలను అందించడం జరిగిందన్నారు. దహాన సంస్కారాల కార్యక్రమం కేవలం 1 ఒక్క రూపాయికే అందిస్తామని తెలిపారు. బీసి బిడ్డగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందని, మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని అన్నారు. టెక్స్టైల్ పార్క్ లో చాలా కార్ఖానాలు మూతపడ్డాయని వీటిని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని అన్నారు.
.
Aksharam Telugu Daily