అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి మండల పరిధిలోని రుద్రంపూర్ గ్రామపంచాయతీ సిపిఐ పార్టీకి చెందిన గ్రామ సర్పంచి గుమ్మడి సాగర్, 8 మంది వార్డు సభ్యులు కొత్తగూడెం ఎన్నికల ఇంచార్జ్, ఎంపీ వధిరాజు రవిచంద్ర , బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో సభ్యులకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినారు. సిపిఐ ముఖ్య నాయకులు, ఏఐటిసి యూనియన్ నాయకులు గుత్తుల సత్యనారాయణ , 2,000 మంది అనుచరులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
-
Aksharam Telugu Daily