అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం /భద్రాచలం /నవంబర్ 18/ అక్షరం న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ తరపున భద్రాచలంలో ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సారపాక బిపిఎల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఉదయం 11 గంటలకు దిగనున్న కేటీఆర్. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకోనున్న కేటీఆర్. ఉదయం 11:15 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకోనున్న కేటీఆర్. అనంతరం 11:30 గంటలకు ఉన్న భద్రాచలం పట్టణంలో రోడ్ షో మరియు స్ట్రీట్ మీటింగ్ లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్.
.
Aksharam Telugu Daily