అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని వివరించారు. అయితే ఇన్ని రోజులు ఉన్న బీజేపీ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకుండా దాటేశారు. విజయశాంతి (నవంబర్ 15న).. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవికి రాజీనామా చేసిన రాములమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా వేసి.. కాంగ్రెస్‌లోకి గ్రాండ్‌గా ఆహ్వానం తెలిపారు. ఈ కార్యక్రమంలో.. టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily