అక్షరం తెలుగు డైలీ - పొలిటికల్ / భద్రాద్రి కొత్తగూడెం : -రాహుల్ గాంధీ రోడ్ షో లో ప్రభంజనం ... -తెలంగాణ తో మాకుంది రాజకీయ సంబంధం కాదు...రక్త సంబంధం -ఇచ్చిన హామీలను పకడ్బందీగా నెరవేర్చేదే కాంగ్రెస్ పార్టీనే.... -రాహుల్ గాంధీ భద్రాద్రికొత్తగూడెం,మణుగూరు, నవంబర్17,(అక్షరంన్యూస్):మణుగూరు అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో అంబేద్కర్ సెంటర్ చేరుకోవడంతో మణుగూరు పట్టణం జన సంద్రాన్ని తలపించింది అడుగడుగునా రాహుల్, రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలతో మణుగూరు పట్టణం మారుమోగింది. ప్రతి పల్లె పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో అశేష జనవాహిని రాహుల్ గాంధీ కోసం ఆయన చెప్పే మాటల కోసం ఎదురుచూసింది. మండుటెండను కూడా లెక్కచేయకుండా అభిమానులు ప్రజలు మహిళలు రాహుల్ కోసం ఎదురు చూశారు మధ్యాహ్నం హెలికాప్టర్లో మణుగూరు చేరుకున్న ఆయన జూనియర్ కళాశాల నుండి ప్రజలకు అభివాదం చేస్తూ అంబేద్కర్ సెంటర్లో కార్నర్ మీటింగ్ కు చేరుకొని ప్రజలకు అభివాదం తెలిపి రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, బి. ఆరె.స్, ఎం.ఐ.ఎం అన్నదమ్ముల పనిచేస్తున్నాయని పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందన్నారు.తెలంగాణతో మా కుటుంబానికి రాజకీయ సంబంధం కాదు అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ తుపానులో ఈసారి కొట్టుకుపోక తప్పదని మీరు చదివిన స్కూల్, వేసిన రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిందేనని రాహుల్ గాంధీ గుర్తు చేశారు దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2014లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర్రాన్ని ఇచ్చిందని తెలిపారు తమ మొదటి లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతామని తెలిపారు ప్రజల ఆశీస్సులతో మొదట తెలంగాణలో తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తామని తనని చూడటానికి వచ్చిన అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు . ఈ సభలో పిసిసి ప్రచార కమిటీ కో- కన్వీనర్, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, పోలేబోయిన శ్రీవాణి, బట్ట విజయ గాంధీ, లతో పాటు భారీగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily