అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : రూ.36.5 తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1859కి చేరింది. ఇక హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్ రూ.2064కు పడిపోయింది. వాణిజ్య సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1959, ముంబైలో 1811.5, చెన్నైలో రూ.2009.5గా ఉన్నది. కాగా, ఈఏడాది గరిష్ఠస్థాయికి చేరిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు గత జులై నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.5 కోత విధించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం విశేషం.
.
Aksharam Telugu Daily