అక్షరం తెలుగు డైలీ - టెక్నాలజి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ చుంచుపల్లి/ సెప్టెంబర్.30/ అక్షరం న్యూస్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీలో గల విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీర్ఘకాలిక క్రోమ గ్రంధి వ్యాధితో బాధపడుతున్న మహిళకు డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య బృందం చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ విజయ్ కుమార్ జనరల్ సర్జన్ తో పాటు డాక్టర్ శ్రీధర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డాక్టర్ సీతారాం అనస్థీషియా తో కలిసి దీర్ఘకాలిక క్రోమా గ్రంధి యొక్క వ్యాధి (గ్రంధిలో రాళ్లు) ఉండటం వలన కడుపు నొప్పితో బాధపడుతున్న నాగమణి వయస్సు 57 సంవత్సరాలు అను పేషంట్ విశ్వాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సంప్రదించగా ఆ మహిళకు పరీక్షలు నిర్వహించి, క్రోమ గ్రంధిలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరిగింది. శస్త్ర చికిత్స అనంతరం డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి నగరాల్లో జరిగే శస్త్ర చికిత్సలు ఇక విశ్వాస్ మల్టీ స్పెషాలిటీలో విజయవంతం గా చేయబడునని అన్నారు.
Aksharam Telugu Daily