అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్దిపేట జిల్లా : జిల్లాలో చేపడుతున్న ఎండిఏ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ తో పాటు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ శనివారం రోజున నారాయణపేట ప్రాథమిక ఆరోగ్య పరిధిలో నిర్వహిస్తున్న ఫైలేరియా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంలో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటికి వెళ్లి ఉచిత మందుల పంపిణీ యొక్క పనితీరును పర్యవేక్షించారు. అనంతరం నారాయణపేట ప్రాథమిక కార్య కేంద్రానికి వెళ్లి అక్కడ సిబ్బందితో ఎండిఎ కార్యక్రమం యాక్షన్ ప్లాన్ ను మరియు ఇప్పటివరకు మందుల పంపిణీ యొక్క పరిస్థితిని అడిగి తెలుసుకుని తగు సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో చేపడుతున్న ఫైలేరియా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మందుల పంపిణీ కేంద్రం వారితో సహకరించి మందులను వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మందులు సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు కలగవని తద్వారా ఫైలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని డిటిహెచ్ ఎంఒ ప్రజలకు తెలిపారు.
.
Aksharam Telugu Daily