అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / : చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కోబ్రా’తో మంచి శుభారంభం దక్కపోయినా.. ఇటీవలే విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’తో మంచి విజయం సాధించాడు. లేజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన భారీ కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈయన పా.రంజిత్ దర్శకత్వంలో ‘చియాన్61’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాకు సంబంధించిన టైటిల్& ఫస్ట్‌లుక్ పోస్టర్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుండి అఫిషీయల్ ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 19 శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కతుందట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారట. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపి, మిగిలిన భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తారట. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily