అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : న్యూఢిల్లీ: ఓయో రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడికి వచ్చే జంటల కదలికలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ఒక ముఠా ఆట కట్టించారు నోయిడా పోలీసులు. ఓబాధిత జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను గుర్తించి ఆకస్మిక రైడ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఈసీక్రెట్ కెమెరాల బాగోతంలో ఓయో స్టాఫ్ పాత్ర ఏమిలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.విష్ణుసింగ్, అబ్దుల్ వాహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్ అనే నలుగురు నిందితులు నోయిడాలోని మూడు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారని, ఈ క్రమంలోనేరూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పారు.ఓయో గదుల్లో జంటల కదలికలన్నీ ఆ కెమెరాల్లో రికార్డవుతాయని, తర్వాత నిందితులు ఆ వీడియోలను సంబంధిత జంటలకు పంపి డబ్బు డిమాండ్ చేస్తారని, డబ్బులుఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్ మెయిల్ చేస్తారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ నలుగురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 11 లాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్‌లు, 22 ఏటీఎం కార్డులు ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాంగుకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
.
Aksharam Telugu Daily