అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : కొణిజర్ల : ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం కొనిజర్ల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు పోలీస్ కథనం ప్రకారం చిన్న మునగాల గ్రామానికి చెందిన పగడాల వెంకటేశ్వర్లు తనయుడు పగడాల ఉమామహేశ్వరరావు 15 మృతుడు పక్క గ్రామమైన పెద్ద మునగాలలో పదో తరగతి విద్యను చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సాయంత్రం పాఠశాల నుండి సైకిల్ పై నలుగురు విద్యార్థులతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఇంటికి అతి సమీపంలోనే పెద్ద మునగాల వైపు నుండి కాచారం కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ నిర్లక్ష్యంతో డ్రైవర్ నడపడంతో విద్యార్థికి ఢీకొనటంతో అక్కడకక్కడే తీవ్ర రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామస్తులు సంఘటనకు చేరుకొని విద్యార్థి శవం పై రోదిస్తున్న తీరు పలువురుని కంటతడి పెట్టించింది. విద్యార్థి ఉదయం పూట అందరితో సరదాగా గడిపి పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోకుండానే మృత్యువడిలోకి చేరటంతో తల్లిదండ్రుల రోదనలు ఆవేదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి.విద్యార్థికి ఉన్నత అధికారులు సంఘటనకు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలపాటు శవం వద్దనే నడిరోడ్డుపై ఆందోళన చేపట్టారు. క ఎస్ ఐ టి వై రాజు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆందోళనకారులు తమకు న్యాయం జరిగే వరకూ విద్యార్థి శవాన్ని తరలించవద్దని బేస్మించుకోవడంతో ఆందోళన గ్రామస్తులందరూ చేరటంతో మరింత ఉదృతమైంది. దీంతో స్థానిక పోలీసులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో విద్యార్థి మృతి చెందటంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఈ విషయమై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily