అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : ముంబై: సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును పెంచింది. రూ.10 కోట్ల లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై 0.30 శాతం(30 బీపీఎస్) ఇంట్రెస్ట్ రేటును పెంచినట్లు ఇవాళ ఎస్బీఐ ప్రకటించింది. రూ.10 కోట్ల కన్నా తక్కువగా ఉన్న డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటులో ఎటువంటి మార్పు లేదని ఎస్బీఐ పేర్కొన్నది. 10 కోట్ల కన్నా తక్కువ డిపాజిట్లపై ప్రస్తుతం 2.70 శాతం ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అయితే కొత్తగా ప్రకటించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో చెప్పింది.
.
Aksharam Telugu Daily