అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : జైపూర్ : బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖానికి స్కార్ఫ్ ధరించిన ఓ దొంగ.. పదునైన కత్తితో బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కత్తితో ఉద్యోగులను భయపెట్టించాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో నగదు నింపాలని ఉద్యోగులను దొంగ బెదిరించాడు. ఓ ఉద్యోగి ఆ దొంగకు భయపడలేదు. అరుపులు విని బ్యాంక్ మేనేజర్ పూనం గుప్తా బయటకు వచ్చారు. ఆమెను కూడా కత్తితో బెదిరించాడు. కానీ ఆ దొంగ బెదిరింపులకు ఆమె ఏ మాత్రం భయపడలేదు. అతన్నే బెదిరించింది. ఇక మరో ఉద్యోగి.. దొంగ లోపల ఉన్న సమయంలోనే బయటకు పరుగు తీసి, డోర్ మూశాడు. దీంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు. దొంగను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన లావీష్ ఆరోరాగా పోలీసులు గుర్తించారు. అతనిపై గతంలో ఉన్న దొంగతనం కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
.
Aksharam Telugu Daily