అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/పరకాల : హనుమకొండ /పరకాల /మార్చి అక్షరం29. న్యూస్. పరకాల పట్టణంలోని చలి వాగు వద్ద ఉదయం ఆరున్నర గంటలకు కూలీల ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలు చెల్లచెరుగా కింద పడడం జరిగింది. అందులో ఇద్దరు కూలీలు సీరియస్ గా ఉండగా హాస్పిటల్ తరలించగా ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుల వివరాలు దుబసి కోమల, కొంగరి చేరాలు. కూలీలు శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వారీగా తెలుస్తుంది. పత్తిపాక నుండి రేగొండ మండలం లోని పోచంపల్లి గ్రామానికి కూలికి వెళ్తుండగా భూపాల పల్లి నుండి హన్మకొండ కు వెళ్లే కారు ఢీకొనడంతో అటో బోల్తా పడినట్లు సమాచారం. క్షతగాత్రులను పరకాల పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అదే గ్రామంలో గత సంవత్సరం కూలీల ఆటో బోల్తా పడడంతో మృతి చెందిన సంఘటన మరువకముందే మళ్లీ ఈ సంవత్సరం కూడా అలాంటి సంఘటన చెందడంతో గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు.
.
Aksharam Telugu Daily