అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / హన్మకొండ/పరకాల : ప్రాణాపాయ స్థితిలో రాష్ట్ర అధ్యక్షుడు. దాడిని తీవ్రంగా ఖండించిన ఆరెకుల రాష్ట్ర సంఘం. ఇది హేయమైన చర్య : తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు. హనుమకొండ/ పరకాల/ మార్చి28. అక్షరం న్యూస్. అరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ హైదరాబాదులోని తన నివాసంలో కారును పార్కింగ్ చేసి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.అతన్ని వెంటనే హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించగా రెండు కాళ్లు, చేతులు విరిగాయని డాక్టర్లు తెలిపారు. గాయాల నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారు.విషయం తెలుసుకున్న ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు హుటాహుటినా హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి, రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీని చూసి పరామర్శించారు.డాక్టర్లకు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇది హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడినటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిపైన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరె కులస్తులంతా సమయమనం పాటించాలని అన్నారు. కులం అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తి పై ఇటువంటి దాడులు చేయడం దురదృష్టకరమని అన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు పై దాడిని ఆరెకుల రాష్ట్ర సంఘం వివిధ జిల్లాల జిల్లా కమిటీలు ముక్తకంఠంతో ఖండించాయి.
.
Aksharam Telugu Daily