అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,మార్చి26(అక్షరం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఎ ఒక్కరు కూడా కంటి సమస్యలతో భాద పడకూడదని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలంలోని తోటపల్లి గ్రామంలో నేడు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధశర్మతో కలిసి ప్రారంబించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోవలని, కంటి సమస్యలు ఉన్న వారికీ ప్రభుత్వ కళ్ల అద్దాలు పంపిణి చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
.
Aksharam Telugu Daily