అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,మార్చి26(అక్షరం న్యూస్):- మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయంను కాపాడటం కోసమే సిపిఐ(ఎం)పార్టీ జన చైతన్య యాత్ర చేస్తున్నదని సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. జన చైతన్య యాత్ర ఆదివారం సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించగా మండలంలోని దేవక్కపల్లి స్టేజి వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న హాజరై స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా సాగిస్తున్న పాలన కార్పొరేట్ శక్తుల బొజ్జలు నింపడానికే పరిమితమైనదని, శ్రామిక శక్తులకు మతం పేరుతో విడదీస్తూ ఓట్ల రాజకీయనికి పాల్పడుతున్నదని అన్నారు.తెలంగాణ ప్రజలను క్షేత్ర స్థాయిలో కలిసి ప్రజా సమస్యల పట్ల అవగాహన కల్పించి, ప్రజా సమస్యల పరిష్కారని ప్రజలను సమాయత్తం చేయడానికి యాత్ర ద్వారా ప్రజాలలోకి వస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశయ్య, స్కైలాబ్ బాబు, జగదీష్, జయలక్ష్మి, అడివయ్య, జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా నాయకులు కాముని గోపాలస్వామి, దాసరి కళావతి, శశిధర్,మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, భాస్కర్,సత్తిరెడ్డి, బొమ్మిడి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Aksharam Telugu Daily