అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ మార్చి 24 - మార్చి 20 నుండి ఏప్రిల్ 30 వరకు పోషకాహారం చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు పోషకపక్షం అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు జిల్లా స్ర్తీ శిశు సంక్షేమ అధికారి లేనినా మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన గోరుగొండ చెన్నాపురం తిప్పాపురం పెద్దమిడిసిలేరు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పోషకాహారం చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. తగినంత మోతాదులో పోషకాహారం అందకపోతే పిల్లలు తీవ్ర పోషక లోపంతో జన్మిస్తారని గర్భిణీ స్త్రీలకు సూచించారు. కావున గర్భిణీ స్త్రీలు తగినంతగా పోషకాహారాన్ని చిరుధాన్యాలను తీసుకోవాలని గర్భిణీలకు తెలిపారు. అనంతరం పెద్ద మిడిసి లేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో కిషోర బాలికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భరణి బాబు ఐసిడిఎస్ పిఓ చైతన్య తిప్పాపురం సర్పంచ్ కారం కన్నారావు కార్యదర్శి షేక్ రఫీ అంగన్వాడి సూపర్వైజర్ బందా స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily