అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మార్చి 24 (అక్షరం న్యూస్) రైతుకు కష్టం వస్తే తనకు వచ్చినట్టు భావించి ఇటీవల అకాల వర్షానికి నష్టపోయిన రైతుల ఆవేదనను గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టకూడదని ఆలోచనతో వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాన పదివేల రూపాయలు ప్రకటించినందుకు ఓదెల మండలంలోని గూడెం గ్రామంలోని బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుల గ్రామ రైతుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో నష్టపోయిన రైతుల వివరాలను దాసరి మనోహర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించేందుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు అని రాబోయే ఎన్నికల్లో రైతుల పక్షపాతి అయిన బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో రైతులు గెలిపిస్తారని అదేవిధంగా పెద్దపెల్లి నియోజకవర్గం లో మూడోసారి అతి భారీ మెజార్టీతో మనోహర్ రెడ్డి గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రైతుబంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు రేగుల సంపత్ రైతుబంధు సమితి మండల సభ్యులు రాజిరెడ్డి యూత్ అధ్యక్షులు నల్ల శివారెడ్డి దళిత కమిటీ అధ్యక్షుడు తిప్పారపు రఘుపతి వార్డ్ మెంబర్ గుడిసె సమ్మయ్య మరియు గ్రామ రైతులు బండి సంతోష్ గుడి నాగరాజు నిప్పుల స్వామి విరముష్టి చంద్రమోహన్ సతీష్ కొత్తపల్లి సదానందం బండారి రాయమలు తిప్పారపు రాజేందర్ ఆషాడపు రాకేష్ సీత గణేష్ బండారి సుధాకర్ కర్ర రాజు పుప్పాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily