అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : జ్యోతి నగర్ మార్చి 24 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ ఎన్టిపిసి రామగుండం ప్రక్కన నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని మొట్టమొదటి 800 మెగావాట్ల యూనిట్లో గురువారం అర్ధరాత్రి తర్వాత సింక్రోనైజ్ చేశారు. 12.54 నిమిషాలకు ఈ యూనిట్ లో విద్యుత్పత్తి ప్రారంభమైంది. తెలంగాణ రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ యూనిట్ ఆవరణలో కేక్ కట్ చేశారు అధికారులంతా సంబరంలో పాలుపంచుకున్నారు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రసేన్జిత్ పాల్ ఇతర సిబ్బంది ఒకరినొకరు అభినందించుకున్నారు. గత మూడు నెలలుగా ఈ యూనిట్లో సింక్నానైజేషన్ కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అయితే కొన్ని సాంకేతిక వంతురాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. 2017లో నిర్మాణం మొదలు పెట్టిన యూనిట్ కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జాప్యం జరిగింది. మరో 800 రెండవ యూనిట్ కూడా రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని మొట్టమొదటి 800 మెగా వాట్ల యూనిట్ ఉత్పత్తి చేసే విద్యుత్తు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. దీంతో కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టిపిసి విద్యుత్తు సరఫరా చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపట్టాలని చట్టం చేశారు.
.
Aksharam Telugu Daily