అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,మార్చి22(అక్షరం న్యూస్): మండల భారతీయ రాష్ట్ర సమితి చేరికల కమిటీ ఇంచార్జీలుగా మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినిపల్లి శ్రీనివాస్ రావు(బీఎస్ఆర్), గూడెం గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తాలను రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు నియమించినట్లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ చేరికల కమిటీ ఇంచార్జీలుగా వారిని నియమించినందు రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంఎల్ఎ రసమయి బాలకిషన్ లను కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యాదిక మెజారితో గెలిపించడాని కృషి చేస్తామని తెలిపారు.
బీఎస్ఆర్ నియామకంతో తోటపల్లిలో సంబరాలు :- బీఆర్ఎస్ పార్టీ చేరికల కమిటీ ఇంచార్జీగా మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బోయినపల్లి శ్రీనివాస్ రావును నియమించడం పట్ల తోటపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తోటపల్లి దేవక్కపల్లి ఎంపీటీసీ సభ్యులు నల్లగొండ లక్ష్మీనరసయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కవ్వంపల్లి లక్ష్మణ్ ఆద్వర్యంలో కేక కట్ చేసి, స్వీట్స్ పంపించి చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాంపల్లి శంకర్, రేవోజు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రేవోజు రాజుకుమార్,ఎస్సీ సెల్ మండల కార్యదర్శి మశం బాబు,బిఆర్ఎస్ యువజన నాయకులు బోయినిపల్లి సాయి కృష్ణ రావు, ,నల్లగొండ రామయ్య,గౌరవేణి కుమార్,గుండ నిరంజన్, పొలావేణి సంపత్,కనుకూట్ల మధు,మిట్టపల్లి శేఖర్,సొరూపక శ్రీనివాస్,సొళ్ళు అజయ్,బండి అంజి,నగునూరి రణదీప్, అంకమల్ల ప్రశాంత్,నల్లగొండ కుమార్,బిగుల్ల మహేష్,నల్లగొండ అజయ్,నల్లగొండ ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Aksharam Telugu Daily