అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/ మార్చి -20 (అక్షరం న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మేడి రాజు 35 ఉరి వేసుకుని సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా గత వారం క్రితం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. రాజు మృతికి గల కారణాలు ఏవి లేవని రాజు తల్లి పోచవ్వ పేర్కొన్నారు. మృతుడికి సోదరుడు నర్సింలు ఉండగా తను వేరే కాపురం ఉంటున్నట్లు తెలిపారు. కాగా తండ్రి చనిపోగా మృతుడు తల్లితోనే ఓకే ఇంట్లో ఉంటున్నారు. రాజు మృతి పట్ల కుటుంబ సభ్యులు కులస్తులు బోరుణ విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily