అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హన్మకొండ/పరకాల : వడగళ్ల వానతో గూడు కోల్పోయిన ఉప సర్పంచ్ డైక శ్రీనివాస్ హనుమకొండ/ పరకాల/ మార్చి19. అక్షరం న్యూస్. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకరిస్తూ కృషి చేస్తున్న గ్రామ ఉపసర్పంచ్ డైక శ్రీనివాస్ గూడు శనివారం కురిసిన భారీ వడ గాండ్ల వానతో కూలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో శ్రీనివాస్ భార్య పిల్లలు రాత్రి నుండి నిద్రపోకుండా భయం భయంగా గడిపారు. ఈ సంఘటన పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ఉప సర్పంచ్ డైక శ్రీనివాస్ ఇల్లు శనివారం రాత్రి ఒక్కసారిగా కూలడంతో భార్య పిల్లలు, తల్లిని తీసుకొని బయటికి వచ్చి నిద్ర లేకుండా గడపానని ఉప సర్పంచ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న తనను పరకాల ఆపద్బాంధవుడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. తను నిత్యవసర వస్తువులు కూడా వర్షంలో తడవడంతో గ్రామ సర్పంచ్ శాతరాశి రమాదేవి సుధాకర్, పరకాల మండల యూత్ అధ్యక్షుడు సనత్ కుమార్ పటేల్ ఆదివారం రోజు వారికి నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ కి ఎమ్మెల్యే ఆశీస్సులతో డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
.
Aksharam Telugu Daily